- Advertisement -
HomeతెలంగాణAmma Nagar | అమ్మనగర్​లో సమస్యలు పరిష్కరించాలి

Amma Nagar | అమ్మనగర్​లో సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

అక్షరటుడే , ఇందూరు:Amma Nagar | నిజామాబాద్ నగరంలోని అమ్మ నగర్ amma nagar nizamabad కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ nizamabad muncipal corporation commissioner dileep kunar, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి(Rural MLA Bhupathi Reddy)కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కాలనీలో వారం రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రధానంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, రోడ్లు గుంతలు పడి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. వినతిపత్రం అందించిన వారిలో అమ్మనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రెంజర్ల నరేష్, స్వామి యాదవ్, కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, మాడవేడి వినోద్ కుమార్, మహేందర్, మధుసూదన్, ప్రవీణ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News