అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు వెళ్తే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని టీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో (Karshak BED College) శనివారం టీయూడబ్ల్యూజే టియుడబ్ల్యుజే పట్టణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
జర్నలిస్టుల పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల చారి, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లు, హక్కుల సాధన కోసం వర్కింగ్ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు (house plots) అందజేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమాజం మార్పు, అభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టులను (journalists) అన్నివిధాలా ఆదుకోవాలన్నారు. అనంతరం రాజేశ్, శివ, అబిద్, అర్షద్, సురేష్, శ్రీకాంత్, శ్రీనివాస్‌లతో పట్టణ కమిటీని ప్రకటించారు. సమావేశంలో యూనియన్ నాయకులు ప్రశాంత్, గంగాధర్, శ్రీనివాస్, వెంకటేష్, రాజు, ప్రభాకర్ , సురేష్, రెహమాన్, అన్వర్, మాజిద్, ఆశయ్య, రజాక్, హరీశ్, రమేశ్, రంజిత్, శశి, రమణ, ప్రభు, రాము, తదితరులు పాల్గొన్నారు.
