అక్షర టుడే, ఇందూరు: Youth Day | రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (AIDS Control Organization) ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పలు కేటగిరిల్లో జిల్లాలో 5కే రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సర్టిఫికెట్లు, నగదు బహుమతి అందజేశారు. కళాశాల బాలుర విభాగంలో సిద్ధార్థ, బాలాజీ (జీజీ కళాశాల) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
బాలికల విభాగంలో శ్రీవర్ధిని (జీజీ కళాశాల), అఖిల (సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల) గెలుపొందారు. అలాగే పాఠశాల విభాగంలో క్విజ్‌లో దీక్షిత, గంగోత్రి (ముబారక్‌నగర్, జెడ్పీహెచ్ఎస్), లావణ్య, మహేక్ (కుమార్ గల్లి, ప్రభుత్వ పాఠశాల) గెలుపొందారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీఏ పీడీ సాయాగౌడ్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, టీబీ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.