అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29)– గ్లోబ్ ట్రాటర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) రుచులు, ముఖ్యంగా బిర్యానీపై ప్రియాంక చూపుతున్న ప్రేమ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవలే ఆమె పాత్ర మందాకిని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. ఇదే ఉత్సాహంలో నవంబర్ 15న జరగబోతున్న భారీ ఈవెంట్‌కు కూడా అభిమానులలో భారీ క్రేజ్ నెలకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) జరగనున్న ఈ వేడుకకు 50 వేల మందికిపైగా అభిమానులు హాజరవ్వనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా మహేష్ బాబు ఫస్ట్ లుక్‌తో పాటు ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ కానుంది.
Priyanka Chopra | బిర్యానీకి ఫిదా..
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవల ‘X’ (ట్విట్టర్)లో నిర్వహించిన “Ask PCJ” సెషన్‌లో అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఒక ఫ్యాన్ “హైదరాబాద్ బిర్యానీ (Hyderabad Biryani) ట్రై చేశారా?” అని అడగగా.. ప్రియాంక ఇచ్చిన సమాధానం తెలుగు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. “అదిరిపోయింది” అని తెలుగులో రాసిన ప్రియాంక, హైదరాబాద్ బిర్యానీని ప్రపంచంలోనే బెస్ట్‌గా పొగడడంతో తెలుగు ప్రేక్షకులు ఆమెపై ప్రేమను కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ తరువాత ‘X’ వేదిక మొత్తం బిర్యానీ ఫొటోలు, బెస్ట్ బిర్యానీ హోటల్స్ సజెషన్స్‌తో నిండిపోయింది.
రాజమౌళితో (Rajamouli) పని చేయడం ఎలా ఉంది అని ఒకరు ప్రశ్నించగా ప్రియాంక .. రాజమౌళితో పని చేయడం తనకు అస్సలు కష్టంగా లేదని, ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పే భారీ ప్రాజెక్ట్ అవుతుందని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరిగి అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటున్నానని, తన డైలాగుల కోసం రాజమౌళి ప్రత్యేకంగా సహాయం చేస్తున్నారని వెల్లడించారు. తెలుగు మాట్లాడడంలో మీ అందరి అంచనాలను చేరుకుంటాను అని మాటిచ్చింది ప్రియాంక. హైదరాబాద్ ఆతిథ్యం, బిర్యానీ రుచి, రాజమౌళితో పని అనుభవం, భాషా నేర్చుకునే ఆసక్తి వీటన్నింటితో ప్రియాంక తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించేసింది. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌తో సినిమా హంగామా మరింత పెరగడం ఖాయం.
