HomeసినిమాPriyanka Chopra | ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ఓ స్టెప్ ముందే.. తొలి పారితోషికంతో వజ్రం...

Priyanka Chopra | ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ఓ స్టెప్ ముందే.. తొలి పారితోషికంతో వజ్రం కొనుగోలు చేశా..: ప్రియాంక

తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తనను తాను మహిళగా ఆవిష్కరించుకున్న ప్రత్యేక క్షణాన్ని గుర్తుచేసుకుంది. మొదటి సినిమా పారితోషికం అందుకున్న తర్వాత, ఆ డబ్బుతోనే తన జీవితంలోని తొలి విలువైన ఆభరణం రెండు క్యారెట్ల వజ్రాన్ని కొనుగోలు చేశానని వెల్లడించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Priyanka Chopra | గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎప్పుడూ తన స్టైల్, ఆత్మవిశ్వాసం, ఫ్యాషన్ సెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

భర్త, పిల్లలతో కుటుంబ విహారాలు చేస్తూ, అంతర్జాతీయ రెడ్ కార్పెట్ ఈవెంట్లలో (International Red Carpet Events) మెరుస్తూ వ‌స్తున్న ప్రియాంక ప్రతిసారి తన లుక్‌తో అందరినీ ఆకర్షించడంలో ముందుంటుంది. ముఖ్యంగా ఆమె ధరిస్తున్న ఆభరణాలు ప్రత్యేక చర్చనీయాంశమవుతుంటాయి. లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ బల్గారి గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆభరణాలపై ఉన్న ఆస‌క్తి, అనుబంధం గురించి ఆసక్తికరంగా వెల్లడించింది.

Priyanka Chopra | వాటిపై ప్ర‌త్యేక ఫోక‌స్..

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మాట్లాడుతూ.. నా మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని దాచుకొని ఆ డబ్బుతోనే నేను నా జీవితంలో మొదటి ఆభరణం రెండు క్యారెట్ల వజ్రం కొనుగోలు చేశాను. నా తల్లి అప్పుడు ‘ఇప్పుడే నువ్వు నిజమైన మహిళగా మారావు’ అని చెప్పిందని అని ప్రియాంక తెలిపారు. రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ఆభరణాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. నేను ధరిస్తున్న దుస్తులే ఏ ఆభరణం ధరించాలో నిర్ణయిస్తాయి. ప్రతి ఈవెంట్, ప్రతి లుక్ వెనుక ఒక కథ ఉంటుంది. 2019లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెల్లటి టల్లే గౌనుతో చోపార్డ్ డైమండ్ నెక్లెస్‌, చెవిపోగులతో పీసీ లుక్ ఆ ఏడాది అత్యంత చర్చనీయాంశమైంది.

2017లో మెట్ గాలా కోసం ధరించిన రాల్ఫ్ లారెన్ ట్రెంచ్ గౌన్‌ను (Ralph Lauren Trench Gown) ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటారు. అంతేకాక, 2023 మెట్ గాలాలో ఆమె ధరించిన 11.16 క్యారెట్ల పియర్-ఆకారపు నీలి వజ్రం “లగూనా బ్లూ” నెక్లెస్‌తో మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్‌ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా, ప్రతి సందర్భంలోనూ తన స్టైల్‌తో ఆత్మవిశ్వాసం, సొగసు, స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. అందుకే ఆమెను అభిమానులు ఇప్పటికీ “గ్లోబల్ ఫ్యాషన్ క్వీన్”గా (Global Fashion Queen) కొనియాడుతున్నారు. ఇక ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో సంద‌డి చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ హంగామా చేస్తుంది. ఇప్పుడు మ‌హేష్ బాబు-రాజ‌మౌళి మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

Must Read
Related News