అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Priya Prakash Varrier | కన్ను గీటుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులోను పలు సినిమాలలో నటించి మెప్పించింది.
అయితే ఈ బ్యూటీకి షార్ట్ టైంలో వచ్చిన స్టార్‌డమ్‌ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తోంది. ఒరు అదార్ లవ్ సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఆ వింక్కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రియా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. హీరో నితిన్‌తో సహా పలువురు యువ హీరోల సినిమాల్లో ఆమె నటించింది. కాగా, వివాదాస్పదంగా నిలిచిన శ్రీదేవి బంగ్లా హిందీ సినిమా రిలీజ్ కాకపోవడం నిరాశ కలిగించింది.
Priya Prakash Varrier | ఓటీటీ,సినిమాలు రెండింటిలోనూ స్పీడ్
గత జూన్‌లో విడుదలైన మలయాళ చిత్రం (Malayalam Film) కొల్లా ఈటీవీలో మంచి స్పందన తెచ్చుకుంది. ఓటీటీలో కూడా ప్రియాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆమె యాక్టివిటీ ఎప్పుడూ ఫుల్ స్వింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రియా వెకేషన్లో తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఒక అందమైన రిసార్ట్‌లో సింపుల్ బికినీ లుక్‌లో రిలాక్స్ చైర్‌పై వివిధ భంగిమల్లో పోజులు ఇస్తూ కనిపించిన ఆమె ఫోటోలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ప్రియాతో పాటు వెకేషన్లో ఎవరు ఉన్నారు? అన్నది నెట్లో చర్చనీయాంశమైపోయింది.
ఇటీవల తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో ప్రత్యేక గీతంలో ప్రియా సందడి చేసింది. ప్రస్తుతం అబ్బాస్–మస్తాన్ దర్శకత్వం వహించిన త్రీ మంకీస్‌లో నటిస్తోంది. రాణీ ముఖర్జీ, అర్జున్ రాంపాల్ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో ఉన్నారు. అదే విధంగా లవ్ హ్యాకర్స్ అనే జెన్ Z సినిమాలో కూడా ప్రియా నటిస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమైన రామాయణంలో ప్రియా ప్రత్యేక పాత్రలో కనిపించనుందని టాక్. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా 2026, 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ప్రియా మరోసారి టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓ ప్రముఖ యువ దర్శకుడు కథ చెప్పి ప్రియాను ఒప్పించాడని సమాచారం. కానీ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.