అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Private Travels Bus | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (Hyderabad Outer Ring Road) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
న్యూగో ట్రావెల్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (Electric Bus) మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా.. పెద్ద అంబర్పేట్ (Pedda Amberpet) దగ్గర బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్ చెరువు దగ్గర ఔటర్ ఎక్కి పెద్దఅంబర్ పేట్ దగ్గర దిగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Private Travels Bus | వరుస ఘటనలు
కర్నూల్ బస్సు ప్రమాదం మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్ సమీపంలో కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనను మరవక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో (Private Travels Bus) టికెట్ బుక్ చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్నారు. కాగా.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు సైతం శనివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు లారీని ఢీకొట్టింది. జడ్చర్ల దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.