అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shamshabad | హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ బస్సు (Private School Bus) గురువారం ఉదయం బోల్తా పడింది.హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (National Highway) పై ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది.
నారాయణపేట జిల్లా (Narayanpet District) మరికల్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ విద్యార్థులు టూర్‌కు బయలుదేరారు. సెలవు కావడంతో హైదరాబాద్‌లోని జలవిహార్‌కు వెళ్తుండగా.. శంషాబాద్ సమీపంలో బస్సు బోల్తా పడింది. బస్సును వెనక కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
Shamshabad | భారీగా ట్రాఫిక్ జామ్
ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల సాయంతో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై బస్సు బోల్తా పడటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) ఘటన స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు, స్థానికులతో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపిస్తున్నారు.