అక్షరటుడే, బాన్సువాడ : Private Hospitals | బాలుడు మృతి చెందిన ఘటనలో ఓ ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారులు(Medical Officers) నోటీసులు ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి(Private Hospital)లో ఇటీవల బాలుడిని చేర్పించగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడు.
ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. విచారణలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తేలింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical Health Department) ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించినందుకు మూడు రోజుల్లో ఆస్పత్రి మూసివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో విద్య(Deputy DMHO Vidya) తెలిపారు.