More
    Homeజిల్లాలుకామారెడ్డిPrivate Colleges Association | రేపటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్

    Private Colleges Association | రేపటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Private Colleges Association | ఫీజు రీయింబర్స్​మెంట్​ (Fee reimbursement) బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్​ పీజీ, డిగ్రీ కళాశాలలు (PG Degree Colleges) డిమాండ్​ చేస్తున్నాయి.

    ఈ మేరకు తెయూ పరిధిలోని అన్ని ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కళాశాల బంద్​కు పిలుపునిస్తున్నట్లు ప్రైవేట్​ కళాశాలల అసోసియేషన్ (Private Colleges Association) జిల్లా అధ్యక్షుడు జైపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అతిక్​కు వినతి పత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలలు నడపడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక బంద్​కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. బకాయిలు విడుదలయ్యేవరకు కళాశాలలు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

    కనీసం ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేక, భవనాల అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ (Narala Sudhakar), శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి, నిషిత రాజు, అరుణ్ కుమార్, రాజేందర్, వెంకట కిషన్, దేవా రెడ్డి, అరుణ్ రెడ్డి, హకీం, రమణ, అనిల్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Pension Schemes | పెంచిన పింఛన్లు ఇవ్వకుంటే సీఎంను అడుగడుగునా అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pension Schemes | పెంచిన పింఛన్లు(Pensions) ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని...

    Hero Upendra | హ్య‌క‌ర్ల వ‌ల‌లో ప‌డ్డ క‌న్న‌డ స్టార్ హీరో ఫ్యామిలీ.. ఉపేంద్ర‌తో పాటు ఆయ‌న భార్య ఫోన్ హ్యాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hero Upendra | ప్రముఖ కన్నడ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర మరియు ఆయన...

    Stock Markets | ఎనిమిది సెషన్ల లాభాలకు బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Stock Markets | గత ఎనిమిది సెషన్లు(8 Sessions)గా లాభాల బాటలో పయనిస్తున్న నిఫ్టీకి...