అక్షరటుడే, ఇందూరు: Private Colleges Association | బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన నేపథ్యంలో శనివారం తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం సంఘం ప్రతినిధులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి విద్య, విద్యార్థుల పట్ల సానుకూలంగా ఉంటారన్నారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల (government medical college) ఆయన హయాంలోని ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, మారయ్య గౌడ్, శంకర్, సుజన్, గిరి, నవీన్, రమణ, హకీం, దత్తు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
