Homeజిల్లాలునిజామాబాద్​School Bus Inspection | నిబంధనల ప్రకారం ప్రైవేట్​ బస్సులు నడపాలి

School Bus Inspection | నిబంధనల ప్రకారం ప్రైవేట్​ బస్సులు నడపాలి

నిబంధనలు పాటించని స్కూల్​ బస్సులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో శుక్రవారం పలు స్కూల్​ బస్సులకు ఆర్టీఏ అధికారులు జరిమానాలు విధించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: School Bus Inspection | స్కూల్ బస్సులతో పాటు ప్రైవేట్​ బస్సులను కూడా నిబంధనల ప్రకారం నడపాలని రవాణా శాఖ ఎంవీఐ కిరణ్ కుమార్ (MVI Kiran Kumar) తెలిపారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, పులాంగ్ తదితర ప్రాంతాల్లో పోలీసు, రవాణా శాఖ (Transport Department) సంయుక్తంగా ప్రైవేట్​ ట్రావెల్స్(Private Travels)​, స్కూల్​ బస్సులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సులు పూర్తి ఫిట్​నెస్​తో ఉండాలన్నారు. ప్రధానంగా స్కూల్​ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్(First aid box), ఫైర్ రిసిస్ట్​ సిలిండర్, గ్రిల్స్ తదితర సామగ్రి తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.

School Bus Inspection | 4 కేసులు నమోదు..

నగరంలో తనిఖీలు నిర్వహించి నాలుగు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా కొన్ని బస్సుల్లో రెన్యూవల్​ చేయని సిలిండర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు ఎంవీఐ కిరణ్​కుమార్​ తెలిపారు.