అక్షరటుడే, కామారెడ్డి: Travels Bus | భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు రోడ్లు ధంసమయ్యాయి. తూతూమంత్రంగా రోడ్లకు మరమ్మతులు చేయడంతో తిరిగి దెబ్బతింటున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా.. జాతీయ రహదారిపై వరద ధాటికి రోడ్డు కోతకు గురికాగా.. ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటన సోమవారం కామారెడ్డి (Kamareddy) పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ రహదారిపై చోటుచేసుకుంది.
స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ (Sircilla Bypass) ఆవరణలో జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన చోట ఇటీవల వర్షాలకు రహదారి కోతకు గురైంది. దాంతో రోడ్డు పక్కన ఓ కుంటలో బస్సు బోల్తా పడింది.
Travels Bus | పలువురికి గాయాలు..
ఈ బస్సు నాగ్‌పూర్ (nagpur) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.