అక్షరటుడే, కామారెడ్డి: Prison to Mother and son | ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించి హత్యాయత్నానికి పాల్పడిన తల్లి కొడుకులకు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు కామారెడ్డి రెండవ అదనపు జిల్లా సెషన్స్ (Kamareddy Courts) జడ్జి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Prison to Mother and son | కామారెడ్డి పట్టణంలోని..
కామారెడ్డి పట్టణంలోని (Kamareddy City) రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న సరంపల్లి విజయ్ కుమార్ను 2024 మే 6న రాత్రి బయటకు రావాలని రాత్రి పక్కనే ఉంటున్న తల్లీకొడుకులు పోచారం భాస్కర్, దాకవ్వలు పిలిచారు. అతడు బయటకు రాగానే కులంపేరుతో దూషించడంతో పాటు రోకలిబండతో దాడి చేశారు. అడ్డుకున్న విజయ్ భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
ఈ విషయమై విజయ్ పోలీసులకు (Kamareddy Police) ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ముంబయి నుంచి వచ్చిన విజయ్ పోచారం భాస్కర్ ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుని ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, అతడిని చంపాలని పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సాక్ష్యాలు సేకరించి కోర్టులో సమర్పించగా ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.