అక్షరటుడే, కామారెడ్డి: Prison for Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ (Drunk drive) తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురికి కామారెడ్డి కోర్టు (Kamareddy Court) జైలుశిక్ష విధించించి. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించిందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు.
Prison for Drunk Driving | జిల్లావ్యాప్తంగా తనిఖీలు..
జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 68 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి కోర్టు శిక్షలు వేసింది. అందులో నలుగురికి 15 రోజులు, 19 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించింది. మొత్తం 68 మందికి రూ.95,500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలో ఎక్కడిక్కకడ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తాగి వాహనాన్ని నడిపితే శిక్షలు తప్పవన్నారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.