ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | పథకాల అమలుకు ప్రాధాన్యతనివ్వాలి

    Collector Nizamabad | పథకాల అమలుకు ప్రాధాన్యతనివ్వాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Collector Nizamabad | ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. భీమ్​గల్​ మున్సిపాలిటీని (Bheemgal Municipality) ఆయన బుధవారం సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కోవార్డు వారీగా ఆయా అంశాల్లో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్.. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

    Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

    ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని.. పట్టణాల్లో కూడా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

    ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రూ. లక్ష వరకు రుణం అందించేలా చొరవ చూపాలని చెప్పారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్​లైన్​లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఆగస్టు 14వ తేదీ లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, భీమ్​గల్​ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహశీల్దార్ షబ్బీర్ తదితరులున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...