అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | భూభారతి (Bhubarathi) దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం నిజామాబాద్ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే సకాలంలో సులభంగా దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Collector Vinay Krishna Reddy | రైతునేస్తం కార్యక్రమానికి సిద్ధం చేయాలి
ప్రభుత్వ ఈనెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం (Raithu Nestham) కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలో రైతు వేదికలను సందర్శించారు. ప్రతి రైతువేదికలో నీటి వసతి, టాయిలెట్, సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రైతులతో ముఖాముఖి జరుపుతారని తెలిపారు.
3 comments
[…] కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు […]
[…] కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. […]
[…] కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. గ్రామ […]
Comments are closed.