అక్షరటుడే, బోధన్: పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు. ఎడపల్లి(yedapalli)లో మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మండలాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
