అక్షరటుడే, బాన్సువాడ: Vaddera Sangham | రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో వడ్డెరలకు ప్రాధాన్యతనిస్తామని, హైదరాబాద్ నగర అభివృద్ధిలో వడ్డెరల పాత్ర ప్రముఖమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), సీతక్క, అజారుద్దీన్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని (Jubilee Hills constituency) బోరబండ జయశంకర్ కమ్యూనిటీ హాల్‌లో జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు, బాన్సువాడ వాస్తవ్యుడు పిట్ల శ్రీధర్ అధ్యక్షతన వడ్డెరల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు పొంగులేటి, సీతక్క, అజారుద్దీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వడ్డెర కులస్థుల కోసం ఐదెకరాల భూమిని కేటాయిస్తామన్నారు.
పీజేఆర్ హయాంలో వడ్డెరలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) వాటిని రద్దు చేసిందన్నారు. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరిగి అందజేస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని.. అందుకే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా వంటి పథకాలు అందిస్తున్నామన్నారు.
Vaddera Sangham | వడ్డెరలకు లేబర్ కార్డులు..
వడ్డెరులకు లేబర్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను (Congress candidate Naveen Yadav) గెలిపించాలని విన్నవించారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు గుంజ రేణుక, వల్లెపు శివకుమార్, వల్లెపు నరసింహారావు, వేముల యాదయ్య, పల్లపు సమ్మయ్య, బత్తుల లక్ష్మీ కాంతయ్య, వేముల భరత్, బోదాసు రవి, వేముల సత్యం, పల్లపు రమేష్, జెరిపటి రాజు, వల్లెపు గిరీష్, గుంజ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
