ePaper
More
    HomeజాతీయంPM Modi | గుజరాత్‌లో ప్రధాని పర్యటన.. పూల వర్షం కురిపించిన కల్నల్​ సోఫియా కుటుంబం

    PM Modi | గుజరాత్‌లో ప్రధాని పర్యటన.. పూల వర్షం కురిపించిన కల్నల్​ సోఫియా కుటుంబం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం గుజరాత్​ చేరుకున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా వడోదరలో రోడ్​ షో(Road show) నిర్వహించారు. ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor) అనంతరం తొలిసారి గుజరాత్​లో పర్యటిస్తున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. త్రివర్ణపతాకాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ మోదీని ఆహ్వానించారు.

    PM Modi | ప్రత్యేకంగా కల్నల్​ సోఫియా కుటుంబం

    ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ఆ వివరాలను విదేశాంగ కార్యదర్శితో పాటు కల్నల్​ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi), వింగ్​ కమాండర్​ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh)​ మీడియాకు వెల్లడించారు. అయితే సోఫియా కుటుంబం వడోదరలో స్థిర పడింది. మోదీ రోడ్​ షో సందర్భంగా సోఫియా కుటుంబ సభ్యులు ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు.

    PM Modi | రూ.77 వేల కోట్ల ప్రాజెక్టులు

    ప్రధాని మోదీ వడోదర(Vadodara) పర్యటనలో భాగంగా రూ.77 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్​ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రైలు ఇంజిన్ల తయారీ కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ రైలు ఇంజిన్‌(Electric Train Engine)ను మోదీ ప్రారంభించారు. మంగళవారం కూడా మోదీ గుజరాత్​లో పర్యటించనున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...