More
    Homeఅంతర్జాతీయంPM Modi | ప్ర‌ధానికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్‌

    PM Modi | ప్ర‌ధానికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ నేత‌లంతా ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.

    అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయిల్ ప్ర‌ధాని నేత‌న్యాహు, ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్, భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూడలం స‌హా ప్రపంచ నాయ‌కులంద‌రూ మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు.

    PM Modi | ఫోన్ చేసిన ట్రంప్‌

    ప్ర‌ధానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి బ‌ర్త్ డే విషెస్ (Birthday Wishes) తెలిపారు. మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపిన తొలి ప్రపంచ నాయకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జూన్ 17 తర్వాత వారిద్దరి మధ్య జరిగిన తొలి సంభాషణ ఇదే. రష్యాతో వాణిజ్యం, ఇంధన సంబంధాలపై అమెరికా, ఇండియా మ‌ధ్య వారాల తరబడి కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌కు తాజా ఫోన్ సంభాష‌ణ‌తో తెర ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

    PM Modi | ప్ర‌పంచ నేత‌ల సందేశాలు

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu).. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మ‌ధ్య మ‌రింత సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డాల‌ని ఇరువురు నేత‌లు ఆకాంక్షించారు. మ‌రోవైపు, ఇండియా – ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా ప్ర‌ధానికి శుభాకాంక్షలు తెలిపారు. “నా స్నేహితుడు ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతదేశంతో ఇంత బలమైన స్నేహాన్ని పంచుకోవడం ఆస్ట్రేలియా గర్వంగా ఉంది. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం అందించిన అద్భుతమైన సహకారానికి మేము ప్రతిరోజూ కృతజ్ఞులమై ఉన్నామని” ఆస్ట్రేలియా ప్ర‌ధాని పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘X’లో వీడియో షేర్ చేశారు.

    బ్రిట‌న్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ప్ర‌ధానికి శుభాకాంక్షలు తెలిపారు. “ప్రధాని మోదీకి (PM Modi) 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. మోదీ జీ ఎల్లప్పుడూ నాకు, బ్రిటన్‌కు మంచి స్నేహితుడు. UK-భారతదేశం సంబంధాలు మరింత బలపడడం చూసి నేను సంతోషంగా ఉన్నానని” పేర్కొన్నారు. భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూడలం ప్రధాని మోదీకి బర్త్​డే విషెస్​ తెలుపుతూ, ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షించారు. బిల్ గేట్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారతదేశ పురోగతిని, ప్రపంచ అభివృద్ధిలో ప్ర‌ధాని సహకారాన్ని ప్ర‌శంసించారు.

    More like this

    Jubilee Hills | జూబ్లీహిల్స్‌ టికెట్​కు పెరుగుతున్న పోటీ.. తనకే టికెట్​ ఇవ్వాలంటున్న అంజన్‌కుమార్ యాదవ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | అధికార కాంగ్రెస్​ పార్టీ(Congress Party)లో జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం పోటీ...

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే...

    Clear Tax | క్లియర్‌టాక్స్ ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు

    అక్షరటుడే, హైదరాబాద్ : Clear Tax | దేశంలో పన్నుల దాఖలుకు సంబంధించిన ప్రముఖ వేదికైన క్లియర్‌టాక్స్, తమ...