ePaper
More
    Homeఅంతర్జాతీయంG-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు ఆహ్వానం అందింది. కెనడా ప్రధాని (Canada PM) మార్క్‌ కార్నీ మోదీని ఆహ్వానించారు. జూన్‌ 15 నుంచి 17 వరకు కెనడా వేదికగా జీ-7 సమ్మిట్‌ (G-7 Summit) జరగనుంది. ఈ సందర్భంగా మోదీ కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్‌ కార్నీకి అభినందనలు తెలిపారు.

    G–7 కూటమిలో కెనడాతో పాటు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉన్నాయి. అయితే జీ–7 కూటమిలో భారత్​ లేకున్నా.. ఆధిత్య దేశాల ఆహ్వానం మేరకు పాల్గొనవచ్చు. ఈ క్రమంలో కెనడా ప్రధాని మోదీకి ఫోన్​ చేసి ఆహ్వానించారు.

    G-7 Summit | ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

    జీ–7 శిఖరాగ్ర సమావేశానికి తనను ఆహ్వానించడంపై మోదీ ఎక్స్​ వేదికగా స్పందించారు. ఈ సమావేశానికి తాను హాజరవుతానని, కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark carny) ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా జీ–7 సదస్సు జూన్ 15-17 మధ్య కననస్కిస్‌లో జరగనుంది. ‘‘కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నుంచి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల విజయంపై ఆయనను అభినందించాను. జీ –7 సమావేశానికి ఆహ్వానం పంపినందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని మోదీ ఎక్స్​లో రాసుకొచ్చారు.

    G-7 Summit | అంతలో ఎంత మార్పు..

    కెనడా ప్రధానిగా గతంలో జస్టిన్​ ట్రూడో (Justin Trudo) ఉండేవారు. ఆయన హయాంలో భారత్​, కెనడా సంబంధాలు క్షీణించాయి. కెనడాలో ఖలిస్థాని వేర్పాటు వాదులను గుర్తు తెలియని వ్యక్తులు హతమారిస్తే భారతే చేయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని తీరును భారత్​ ఎండగట్టింది. ట్రూడోకు స్వదేశంలో కూడా వ్యతిరేకత రావడంతో పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మార్క్‌ కార్నీ ప్రధానిగా ఎన్నిక అయ్యారు.

    అనంతరం మోదీకి జీ–7 దేశాల్లో పాల్గొనడానికి ఆహ్వానం పంపారు. దీనిని బట్టి ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం చేయడం కోసం ఆయన యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, కెనడా ప్రధానితో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...