ePaper
More
    HomeజాతీయంPM Modi | రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

    PM Modi | రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26 వరకు ఆయన బ్రిటన్​, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రధాని బ్రిటన్​ను సందర్శిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.

    PM Modi | నాలుగోసారి..

    బ్రిటన్ ప్రధాని ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ యూకే(UK)ను సందర్శించనున్నారు. ఆయన బ్రిటన్​లో పర్యటించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రత తదితర అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    READ ALSO  Bihar CM | బీహార్ ఓట‌ర్ల‌కు మ‌రో బొనాంజా.. ఫ్రీగా విద్యుత్ ఇస్తామ‌ని నితీశ్ ప్ర‌క‌ట‌న‌

    PM Modi | మాల్దీవులు స్వాతంత్య్ర  వేడుకలకు..

    ప్రధాని మోదీ మాల్దీవులు (Maldives) స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. గతంలో మాల్దీవులు అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ముయిజ్జు భారత్​ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత పర్యాటకులు ఆ దేశానికి వెళ్లడం తగ్గించారు. ఈ క్రమంలో ముయిజ్జు ప్రధాని మోదీని ఆ దేశ స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానించడం గమనార్హం. మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది మూడోసారి.

    Latest articles

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    More like this