Homeజిల్లాలుకామారెడ్డిYouth Congress | ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం

Youth Congress | ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Youth Congress | మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీఎం మోదీ (Pm modi) దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిస గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ మాట్లాడుతూ.. మోదీ దేశంలో దొంగఓట్లు వేయించుకొని ప్రధాని అయ్యారని ఆరోపించారు. రాహుల్ గాంధీని అరెస్ట్​ చేయడం తగదన్నారు.

ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్​మోహన్ (mla madan mohan)​ సారథ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రిజర్వేషన్లు సాధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, మండలాధ్యక్షుడు రామకృష్ణ, శ్యాంబాబు, లక్ష్మణ్, వినయ్, మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, లైన్ రమేష్, నితిన్, గాండ్ల లక్ష్మణ్, నీల రవి, సల్మాన్, గణేష్, బొట్టు మోతిరాం, మోహన్, సురేష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News