Homeబిజినెస్​SUV e-VITARA | స్వావ‌లంబ‌న దిశ‌గా భార‌త్‌.. ఈ-విటారా కారును ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

SUV e-VITARA | స్వావ‌లంబ‌న దిశ‌గా భార‌త్‌.. ఈ-విటారా కారును ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SUV e-VITARA | భార‌త్ స్వావ‌లంబ‌న దిశ‌గా సాగుతోంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన‌ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ఆయ‌న మంగ‌ళ‌వారం ప్రారంభించారు.

అలాగే, మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ‘e-VITARA’ ను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. గ్రీన్ మొబిలిటీ వైపు ఇండియా చేస్తున్న అన్వేష‌ణకు ఇది ప్ర‌త్యేకమైన రోజు అని పేర్కొన్నారు. ఇక్క‌డ ఉత్ప‌త్తి అయ్యే కార్లు 100 దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయ‌ని పేర్కొన్నారు.

SUV e-VITARA | తొలి ఈవీ

హన్సల్‌పూర్ లోని సుజుకి మోటార్ ప్లాంట్‌ (Suzuki Motor Plant)ను సందర్శించిన ప్రధానమంత్రి మోదీ మారుతి సుజుకి నుంచి మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) అయిన e-VITARA కార్ల‌ ఎగుమతిని ప్రారంభించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తొలిసారి ప్రదర్శించి EV ఇప్పుడు రోడ్ల‌పైకెక్కేందుకు సిద్ధమైంది. జపాన్‌, యూరోపియన్ దేశాల‌తో 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయ‌నున్నారు. EV ఎగుమతి ప్రారంభంతో పాటు, డెన్సో, తోషిబా, సుజుకిల జాయింట్ వెంచర్ అయిన TDS లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌(Hybrid Battery Electrode)ల ఉత్పత్తిని ప్రధాని మోదీ ప్రారంభించారు. 80 శాతానికి పైగా బ్యాట‌రీల‌ను స్థానికంగానే త‌యారు చేయ‌నున్నారు.

ఇండియాలోని నాలుగు ప్లాంట్లలో 2.6 మిలియన్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం క‌లిగిన మారుతి సుజుకి.. హన్సల్‌పూర్ ప్లాంట్‌లో e-VITARAను త‌యారు చేస్తోంది. 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో కంపెనీ 3.32 లక్షల వాహనాలను ఎగుమతి చేయ‌డంతో పాటు దేశంలో 19.01 లక్షల యూనిట్లను విక్రయించినట్లు వెల్ల‌డించింది. e-VITARAను మార్కెట్లోకి తీసుకురావ‌డంతో ఇండియా అధికారికంగా సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల (Suzuki Electric Vehicles) కోసం ప్రపంచ తయారీ కేంద్రంగా మారింది.

Must Read
Related News