అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన అఖండ 2 శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చూడనున్నట్లు దర్శకుడు తెలిపారు.
బాలయ్య ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అఖండ 2 (Akhanda 2) బాక్సఫీస్ దగ్గర దూసుకుపోతుంది. సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలు బలంగా చూపించడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. బాలకృష్ణ డైలాగులు, నటన సినిమాను వెరే లెవల్‌కు తీసుకు వెళ్లాయి. సినిమా సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో ఆదివారం సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడుతూ.. అఖండ2ను ప్రధాని చూడనున్నారని తెలిపారు.
Akhanda 2 | స్పెషల్ షో
ప్రధాని మోదీ అఖండ 2 గురించి విన్నారని బోయపాటి తెలిపారు. సినిమాపై ఆసక్తి చూపించారని చెప్పారు. త్వరలో ఢిల్లీలో మూవీ స్పెషల్ షో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని మోదీ సైతం ఆ షోను చూస్తారని తెలిపారు. మోదీ ఈ సినిమాను చూస్తే ఉత్తర భారతంలో మరింత విజయవంతం అవకాశం ఉంది.
Akhanda 2 | మూవీ చూసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) ఇప్పటికే అఖండ 2 సినిమా చూశారు. శనివారం బోయపాటి ఆయనను కలిసి సినిమా గురించి వివరించారు. ఈ సందర్భంగా తనను ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆశీర్వాదించరని దర్శకుడు బోయపాటి తెలిపారు. ఇది తమ చిత్ర బృందానికి దక్కిన గౌరవం అన్నారు. తమ ప్రయత్నాన్ని ఆయన మెచ్చుకున్నారని చెప్పారు.