అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Subhanshu Shukla | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Subhanshu Shukla)తో శనివారం సాయంత్రం మాట్లాడారు. భారత వైమానిక దళానికి చెందిన 39 ఏళ్ల శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ఆక్సియం-4 (Axiom-4) మిషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
వ్యోమగామి శుక్లా గ్రూప్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు బుధవారం ఫాల్కన్-9 రాకెట్(Falcon-9 rocket) ప్రయోగం ద్వారా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్‌కు పయనమయ్యారు. గురువారం సాయంత్రం ఐఎస్ఎస్(ISS)తో వారి వ్యోమనౌక అనుసంధానం అయింది. ఈ క్రమంలో శనివారం శుక్లాతో మోదీ మాట్లాడారు. కాగా.. శుక్లా బృందం 14 రోజుల్లో అంతరిక్ష కేంద్రంలో పలు ప్రయోగాలు చేపట్టి తిరిగి రానుంది.
కాగా.. అంతరిక్ష కేంద్రంలో తన తొలిరోజు గురించి శుక్లా మాట్లాడుతూ.. జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నట్లు చెప్పారు. తోటి వ్యోమగాములతో ఐఎస్ఎస్లో ఉండడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే నడక నేర్చుకునే చిన్నారిలా.. జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నట్లు శుక్లా తెలిపారు.