అక్షరటుడే, ఆర్మూర్: AIKMS | దేశంలోని కార్పొరేట్ కంపెనీలకే ప్రధాని మోదీ మద్దతిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ప్రజాపంథా కుమార్ నారాయణ భవన్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi) విధానాలకు నిరసనగా హైదరాబాద్లోని (Hyderabad) ఇందిరాపార్క్ (Indira Park hyderabad) వద్ద 8వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం బిల్లు పేరుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం ఆర్మూర్(Armoor Town) ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు గంగారాం, రాజన్న, సాయన్న, ఠాకూర్, అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.