అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chenab Railway Bridge | జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ఇది. ఈ బ్రిడ్జి ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. కశ్మీర్ లోయను దేశంలోని ఇతర రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి దీనిని నిర్మించారు. వందే భారత్ రైలును ప్రారంభించి.. ఈ బ్రిడ్జిని ప్రధాని జాతికి అంకితం చేశారు.
Chenab Railway Bridge | ఎన్నో ప్రయోజనాలు
చీనాబ్ రైల్వే వంతెనతో ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి(Shri Mata Vaishno Devi) – కాట్రా వరకూ నేరుగా ట్రైన్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఇతర రాష్ట్రాల ప్రజలు శ్రీనగర్‌కు వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం లేదు. దీంతో పర్యాటకులు విమానాలు లేదంటే.. జమ్ము వరకూ రైలులో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీనగర్(Srinagar) వెళ్లేవారు. తాజాగా చీనాబ్ రైల్వేపై వంతెన నిర్మాణంతో నేరుగా కనెక్టివిటీ సౌకర్యం ఏర్పడింది.
Chenab Railway Bridge | అత్యంత ఎత్తయిన బ్రిడ్జి
చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్(Eiffel Tower) కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తు ఉంటుంది. భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తులు తట్టుకునేలా దీనిని నిర్మించారు. 2002లో వంతెన పనులు మొదలు పెట్టగా.. నిర్మాణం పూర్తి చేసుకొని నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. తొలిదశలో కాట్రా – బారాముల్ల మధ్య రైలు నడపనున్నారు. కాగా.. ఈ బ్రిడ్జి పొడువు 1315 మీటర్లు. అనేక డిజైన్లు పరిశీలించిన తర్వాత ఆర్చి మోడల్లో ఈ బ్రిడ్జిని కట్టారు.
