అక్షరటుడే, వెబ్‌డెస్క్: Most Popular Leader | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఆమోదం పొందిన నేతగా ఆయన ఘనతను సొంతం చేసుకున్నారు.
అమెరికాకు చెందిన వ్యాపార నిఘా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’లో (Democratic Leader Approval Ratings) 75 శాతం స్కోరుతో ప్రపంచ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు మోదీ పట్ల అత్యంత ఆదరణ చూపారు. ప్రజాస్వామ్య నాయకుడిగా సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పారు. మోదీ తరువాత దక్షిణ కొరియా అధ్యక్షురాలు లీ జే మ్యుంగ్ (President Lee Jae-myung) 59 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు.
Most Popular Leader | టాప్-5లో లేని ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (US President Donald Trump) టాప్-5 జాబితాలో చోటు దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. మార్నింగ్ కన్సల్ట్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం ట్రంప్ మొదటి ఐదు స్థానాల్లో 45శాతం కంటే తక్కువ ఆమోదంతో ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు. తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ (latest Global Leader Approval Rating) 2025 జూలై 4 నుంచి 10వ తేదీ మధ్య నిర్వహించచారు. సర్వే జరిగిన దేశాలలో వయోజన అభిప్రాయాలను తీసుకున్నట్లు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ఇది అమెరికా ఆధారిత వ్యాపార నిఘా, డేటా విశ్లేషణ సంస్థ. ప్రపంచ నాయకుల ప్రజా ఆమోద రేటింగ్లను, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల నాయకులను, వివిధ దేశాలలోని వేలాది మందితో రోజువారీ ఇంటర్వ్యూల ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ సర్వే నిర్వహిస్తుంది.