ePaper
More
    Homeక్రీడలుRCB vs PBKS | ఆనందంతో క‌న్నీళ్లు పెట్టుకున్న విరాట్.. బాధ‌తో ప్రీతి జింటా ఎమోష‌న‌ల్

    RCB vs PBKS | ఆనందంతో క‌న్నీళ్లు పెట్టుకున్న విరాట్.. బాధ‌తో ప్రీతి జింటా ఎమోష‌న‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB vs PBKS | ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) ఐపీఎల్ విజేతగా అవతరించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆర్సీబీ జట్టు చివరకు ఆ గొప్ప కలను నెరవేర్చుకోవ‌డంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. విరాట్ కోహ్లీ(Virat Kohli) అయితే ఆనందంతో క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. త‌న భార్య‌ని హ‌గ్ చేసుకొని ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్టరీ పరేడ్‌లో పాల్గొననుంది. బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విజయ యాత్రను చేపట్టనున్నారు.

    RCB vs PBKS | పాపం.. ప్రీతి..

    ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్సీబీ విక్టరీ పరేడ్ (Victory parade) ప్రారంభం కానుందని ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ప్రకటించింది. మొదటి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ తన అభిమానులతో విజయోత్సవాలను జరుపుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ టైటిల్(IPL title) సాధించలేదని బాధ తొలగిపోవడంతో ఆర్సీబీ అభిమానులు ప్రతి చోటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాణాసంచా, డ్రమ్స్‌తో డ్యాన్సులు వేస్తున్నారు. బెంగళూరులో వేడుకలు అంబరాన్నంటాయి. ఆర్సీబీ గెలుపుపై సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫన్నీమీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    పంజాబ్ కింగ్స్(Punjab Kings) 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పరుగులు సులభంగా వస్తున్నాయి కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్ మినహా ఏ బ్యాటర్ కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయారు. చివరి ఓవర్లో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఓటమి ఖాయమైంది. ప్రీతి జింటా Priety Zinta పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమానిగా ఉన్నారు. జట్టు పట్ల ఆమెకున్న ప్రేమ, స్టేడియంలో ఆమె ఆటగాళ్లను పలకరించే తీరు, ఆటగాళ్లతో ఆమెకున్న సంబంధం ఆమెను అత్యంత ఇష్టమైన యజమానులలో ఒకరిగా చేస్తుంది. ఫైనల్ మ్యాచ్(Final Match) ముగిసిన తర్వాత ఆమె బరువెక్కిన హృదయంతో స్టేడియం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. తెల్ల కుర్తా, ఎరుపు దుపట్టా, సల్వార్ ధరించి ప్రీతి చాలా అందంగా కనిపించింది. కానీ ఓటమి కారణంగా ఆమె చాలా విచారంగా ఉంది. ఆమె ముఖంలో నిరాశ స్ప‌ష్టంగా క‌నిపించింది.

    Latest articles

    Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేత జగదీష్​ రెడ్డి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    More like this