అక్షరటుడే, బాన్సువాడ : Banswada | సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో (Someshwar Village) తీవ్రమైన పోటీ నెలకొంది. 2018 సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి.
Banswada | బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు..
ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch Candidates) బరిలో దిగడంతో గ్రామ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గ్రామంలో మొత్తం 1,465 మంది ఓటర్లు ఉండగా, విభిన్న వర్గాల నుంచి పోటీదారులు రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ గెలుపు కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు.
Banswada | ఎన్నికలపై పెరిగిన ఆసక్తి..
ఎనిమిది మంది పోటీలో ఉండడంఓ గ్రామస్థుల్లో కూడా ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. గతంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామం ఈసారి తీవ్రమైన పోటీకి వేదిక కావడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. గ్రామంలో వర్గాల సమీకరణలు, అభ్యర్థుల వ్యక్తిగత పట్టుదల, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే హామీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.