Homeజిల్లాలునిజామాబాద్​BC Reservations | బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి

BC Reservations | బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి

బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. నగరంలోని వినాయక్​నగర్​లో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) తెలిపారు. జిల్లా కేంద్రంలో ని వినాయక్​ నగక్​ విగ్రహాల పార్కులో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద గురువారం మౌన దీక్ష చేపట్టారు.

దీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ జేఏసీ రాష్ట్ర కో ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా దక్కేవరకు పోరాటం నిలిపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్య ప్రకాష్, రవీందర్, దేవేందర్, శంకర్, అజయ్, చంద్రమోహన్, శ్రీలత, చంద్రకాంత్, సదానంద్, ఆర్టీసీ శ్రీనివాస్, మురళి, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.