అక్షరటుడే, ఇందూరు: Nizamabad Press Club | నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలవడడంతో.. నూతన కార్యవర్గానికి బుధవారం ఎన్నికల అధికారి భాను నియామక పత్రాలు అందజేశారు.
ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, నిర్వహణ కార్యదర్శిగా రాజు, ఉపాధ్యక్షులుగా బైస సంగీత, సతీష్ గౌడ్, గోవిందరాజు, సంయుక్త కార్యదర్శులుగా ఐరవేణి సురేష్, రవి నాయక్, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా ఆడెపు శ్రీనివాస్, రవి కుమార్, సందీప్ దేశ్‌ముఖ్, సందీప్ గౌడ్, రవి చరణ్ రెడ్డి, తాళ్ల శ్రీధర్, జయపాల్, సితారె కృష్ణ, నరేందర్ స్వామి, ప్రీతం రెడ్డి, పబ్బు భుమేష్, సుదర్శన్ ఎన్నికయ్యారు.
Nizamabad Press Club | ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన అర్బన్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు రాజు, సతీష్ గౌడ్, సుదర్శన్, సితారె కృష్ణలను బుధవారం ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షులు ప్రసాదరావు, బాలస్వామి, విద్యాసాగర్, సాయిలు, వెంకటేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.