అక్షరటుడే, వెబ్‌డెస్క్: Droupadi Murmu | శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) హైదరాబాద్ వచ్చారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ (Air Force Training) కేంద్రానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క స్వాగతం పలికారు.
18వ తేదీన రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరుకానున్నారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21వ తేదీన రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.