HomeజాతీయంPresident visits Lord Ayyappa | అయ్యప్పకు రాష్ట్రపతి ఇరుముడి.. స్వామిని దర్శించుకున్న తొలి ఉమెన్​...

President visits Lord Ayyappa | అయ్యప్పకు రాష్ట్రపతి ఇరుముడి.. స్వామిని దర్శించుకున్న తొలి ఉమెన్​ ప్రెసిడెంట్​గా రికార్డు

President visits Lord Ayyappa | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటనలో ఉన్నారు. కేరళ చేరుకున్న ప్రెసిడెంట్​ శబరిమల వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: President visits Lord Ayyappa | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Indian President Draupadi Murmu) కేరళ పర్యటనలో ఉన్నారు. అక్టోబరు 22న కేరళ చేరుకున్న ప్రెసిడెంట్​ శబరిమల వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

అయ్యప్ప స్వామి Lord Ayyappa దర్శించుకునే క్రమంలో రాష్ట్రపతి సంప్రదాయాలను పాటించారు. నల్లటి వస్త్రాలు ధరించారు. ఇరుముడితో మొక్కు చెల్లించారు. తలపై ఇరుముడితో పెట్టుకుని 18 బంగారు మెట్లు ఎక్కారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రపతి భద్రతా సిబ్బంది కూడా ఇరుముడి (irumudi) తో మెట్లు ఎక్కి, స్వామి దర్శించుకున్నారు. ఆలయంలో మధ్యాహ్న పూజలు ముగిసే ముందు అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వయసు 67 ఏళ్లు. రోడ్డు మార్గంలో తిరువనంతపురం నుంచి పతనంతిట్ట, అక్కడి నుంచి పంపా (Pampa) కు చేరుకున్నారు. శబరిమల Sabarimala ఆలయం ఆచార వ్యవహారాల ప్రకారమే రాష్ట్రపతి వ్యవహరించారు.

President visits Lord Ayyappa | 52 ఏళ్ల తర్వాత రెండో రాష్ట్రపతి..

శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకున్న రాష్ట్రపతులు ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే. 1973లో నాటి రాష్ట్రపతి వి.వి.గిరి President V.V. Giri, ఆయన కుమారుడు, ఎంపీలు కలిసి స్వామి దర్శించుకున్నారు.

52 ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్​ హోదాలో ద్రౌపది ముర్ము ఇరుముడితో అయ్యప్ప సన్నిధానంలో అడుగుపెట్టారు. రాష్ట్రపతుల్లో ఒక ఉమెన్​ ప్రెసిడెంట్​ స్వామి దర్శనం చేసుకోవటం ఇదే మొదటిసారి.