అక్షరటుడే, వెబ్డెస్క్: International Fleet Review 2026 | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఐఎన్ఎస్ సుమేధ యుద్ధనౌకలో ప్రయాణించారు. ఏపీలోని విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
సముద్ర బలం, ఐక్యత, సమన్వయం ప్రదర్శిస్తూ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరు వరుసలలో జరిగిన ఫ్లీట్ రివ్యూలో భారతీయ, విదేశీ మూలాలు కలిగిన 72 నౌకల సముదాయం పాల్గొంది. భారత నావికాదళం (Indian Navy) ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ఈ భారీ భాగస్వామ్యం సముద్ర దౌత్య స్ఫూర్తిని హైలైట్ చేసింది.
International Fleet Review 2026 | భారత సముద్ర శక్తి..
రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ యాచ్ట్గా పనిచేస్తున్న INS సుమేధలో ఎక్కడానికి ముందు నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆమె నౌకాదళాన్ని సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పాల్గొన్నారు. సంయుక్త సముద్ర కలయికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాల అధిపతులు, ప్రతినిధులు అధికారులు సహకరించడానికి, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఈ ఫ్లీట్ నిర్వహించారు. ప్రత్యేక దళాల ప్రదర్శన, నౌకల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత సముద్ర శక్తిని ఈ ఫ్లీట్ ప్రపంచానికి చాటి చెప్పింది.
