Homeతాజావార్తలుPresident Draupadi Murmu | నేడు హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu | నేడు హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్​లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్​కు రానున్నారు. తిరుపతి (Tirupati)లో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె నగరానికి చేరకుంటారు. భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారు.

రాష్ట్రపతి ముర్ము (President Draupadi Murmu) గురువారం తిరుపతికి ప్రత్యేక విమానంలో వచ్చారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ముందుగా వరాహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 12:15కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​ (Hyderabad)కు పయనం అవుతారు.

President Draupadi Murmu | స్వాగతం పలకునున్న సీఎం

తిరుమల నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ (Begumpet Airport)కు చేరుకుంటారు. అక్కడ ఆమె గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ, సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) స్వాగతం పలకనున్నారు. ఎయిర్​పోర్టు నుంచి ముర్ము రాజ్ భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 6:15 గంటలకు రాజ్ భవన్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం మళ్లీ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పుట్టపర్తికి వెళ్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు. కాగా నేడు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్​లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.