అక్షరటుడే, ఇందూరు : President Award | రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, విద్యుత్ శాఖ (Electricity Department) ఏడీఈ తోట రాజశేఖర్‌కు రెడ్‌క్రాస్‌లో రాష్ట్రపతి అవార్డు (President’s Award) దక్కడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (bodhan mla sudharshan reddy) అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన నివాసంలో రాజశేఖర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా సమాజ సేవ చేయాలన్నారు. అటువృత్తిలో ఇటు సేవా రంగంలో ముందుంటూ రాజశేఖర్ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ రమేష్ రెడ్డి, రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు, రవీందర్, అబ్బాపూర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
