HomeUncategorizedParliament | రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల‌కు నిర్దేశించ‌జాల‌రు.. సుప్రీంకోర్టు ఆదేశాల‌పై కేంద్రం అభ్యంత‌రం

Parliament | రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల‌కు నిర్దేశించ‌జాల‌రు.. సుప్రీంకోర్టు ఆదేశాల‌పై కేంద్రం అభ్యంత‌రం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament | పార్ల‌మెంట్‌, అసెంబ్లీ రూపొందించిన‌ బిల్లులను ఆమోదించ‌డానికి రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల‌కు సుప్రీంకోర్టు గ‌డువు విధించ‌డాన్ని కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) త‌ప్పుబ‌ట్టింది. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వుల్లో ఉన్న వారిని కోర్టులు నిర్దేశించ‌లేవ‌ని తేల్చి చెప్పింది.

బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి(President), గవర్నర్లకు(Governors) గడువు విధించవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటువంటి గ‌డువులు ప్ర‌భుత్వానికి లేని అధికారాల‌ను ఆక్ర‌మించే ఆయుధంగా మారుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. త‌ద్వారా సున్నిత‌మైన అధికార విభ‌జ‌న‌ను దెబ్బ తీస్తాయ‌ని, అంతిమ‌ంగా రాజ్యాంగ గంద‌ర‌గోళానికి దారి తీస్తాయ‌ని తెలిపింది.

Parliament | సుప్రీం సంచ‌ల‌న తీర్పు..

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై జ‌స్టిస్ జేబీ పార్దివాలాలతో (Justice JB Pardiwala), ఆర్‌.మ‌హదేవన్‌(R. Mahadevan) కూడిన ధర్మాసనం ఏప్రిల్‌లో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి మూడు నెలల గడువు, గవర్నర్లకు ఒక నెల గడువును నిర్దేశించింది.

అయితే, బిల్లుల ఆమోదానికి న్యాయస్థానం గ‌డువు విధించ‌డంపై రాష్ట్ర‌ప‌తి అనేక అభ్యంత‌రాలు లేవ‌నెత్తారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టుకు (Supreme Court) లేఖ రాశారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. అభిప్రాయాలు చెప్పాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ని కోరింది. రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు నిర్దేశించ‌వ‌చ్చా? అనే అంశంపై అభిప్రాయం కోర‌గా, స్పందించిన కేంద్రం కోర్టులో నివేదిక దాఖ‌లు చేసింది. అందులోని వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Parliament | వ్య‌తిరేకించిన కేంద్రం..

రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వారికి ఇటువంటి గడువులు విధించ‌డం వ‌ల్ల ప్రభుత్వానికి లేని అధికారాలను ఆక్రమించే ఒక అవ‌కాశం క‌ల్పిస్తాయ‌ని కేంద్రం తెలిపింది. తద్వారా సున్నితమైన అధికార విభజనను దెబ్బతీస్తాయని, ఇది రాజ్యాంగ గందరగోళానికి దారి తీస్తుందని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక నివేదిక‌ను సమర్పించింది. “ఆర్టికల్ 142 ప్ర‌కారం సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలు ఉన్న‌ప్ప‌టికీ, రాజ్యాంగాన్ని సవరించదు లేదా రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని ఓడించదు. రాజ్యాంగం అలాంటి విధానపరమైన ఆదేశాలు క‌ల్పించ‌లేదు.” అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Tushar Mehta) త‌న నివేదిక‌లో పేర్కొన్నారు.

Parliament | స్థాయిని త‌గ్గించ‌జాల‌రు..

రాష్ట్రపతి, గవర్నర్ కార్యాలయాలు రాజకీయంగా సంపూర్ణమైనవని, ప్రజాస్వామ్య పాలన బిల్లులకు ఆమోదం తెలిపే ప్ర‌క్రియ‌లో కొన్ని పరిమిత సమస్యలు ఉన్నప్పటికీ, గ‌డువు విధించ‌డం రాష్ట్ర‌ప‌తి, గవర్నర్ కార్యాలయాల స్థాయిని త‌గ్గించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఉన్నత ఆదర్శాలను సూచిస్తాయని తెలిపారు. బిల్లుల ఆమోద ప్ర‌క్రియ‌లో ఏవైనా లోపాలు త‌లెత్తితే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజకీయ, రాజ్యాంగ యంత్రాంగాల మాత్ర‌మే ద్వారా పరిష్కరించాల్సి ఉంటుంద‌న్నారు.

Must Read
Related News