అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | హిందూ ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నగరంలోని పలు ఆలయాల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. దేవాలయాల సందర్శన ద్వారా పిల్లలకు మన సంస్కృతి విలువలను తెలియజేయాలన్నారు. ఆలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
