అక్షరటుడే, కామారెడ్డి: Preparations for Vote Counting | జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు క్యూఆర్టీ, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ (Bomb disposal), స్ట్రైకింగ్ ఫోర్స్ టీములను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
Preparations for Vote Counting | కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో..
కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ (163 BNSS Section) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఫలితాల వెల్లడి అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఒకవేళ ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి పొంది, వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct) ఇంకా అమలులోనే ఉందన్నారు. ఓట్ల లెక్కింపునకు హాజరు అయే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువులైన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటల్స్, పేలుడు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు.