అక్షరటుడే, ఇందూరు : Ganesh Immersion | నవరాత్రుల పాటు పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం, సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందూరు నగరంలో ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా మొరం పనులు, విద్యుత్ స్తంభాలకు లైట్లను బిగించారు.
9వ రోజు కొన్ని వినాయకులు నిమజ్జనం (Ganesh Immersion) చేయడంతో వినాయకుల బావి, మాధవనగర్ చెరువు, బోర్గాం బ్రిడ్జి వద్ద బందోబస్తుతో పాటు నగరపాలక సంస్థ సిబ్బందిని నియమించారు.
Ganesh Immersion | గణపతి రథం సిద్ధం..
ఇందూరులో శనివారం జరగబోయే గణపతి నిమజ్జనం రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. గత 80 ఏళ్లుగా సార్వజనిక్ గణేశ్ మండలి (Sarvajanik Ganesh Mandali) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శోభాయాత్రగా వినాయకుడిని తరలిస్తారు. ప్రధానంగా నగరంలోని దుబ్బా చౌరస్తా నుంచి 11 జతల ఎడ్లతో రథం బయలుదేరుతుంది.
Ganesh Immersion | రూట్‌మ్యాప్ ఇదే..
ఇందుకోసం రథాన్ని శుక్రవారం మరమ్మతులు చేయించారు. దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర (Ratha Yatra) లలితామహల్ థియేటర్, గంజ్, గాంధీచౌక్, నెహ్రూ పార్క్, పవన్ థియేటర్, అహ్మదీబజార్, గాజుల్పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్‌లోని బావి వద్దకు చేరుకుంటుంది.
Ganesh Immersion | పోలీసుల తనిఖీలు
రథయాత్ర కొనసాగే రూట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది రథాన్ని, అలాగే రథం వెళ్లే దారిలో పూర్తిగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. 1300 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు సీపీ(CP) ప్రకటించారు.