అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | మరి కొద్ది రోజులలో ఆసియా కప్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే జట్లను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, ఓమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. యూఏఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత జట్టు (Team India) సెప్టెంబర్ 4నే దుబాయ్ చేరుకోనుంది. అయితే, ఈసారి ఆసక్తికర విషయమేంటంటే… సాధారణంగా జట్టు ఎక్కడికైనా వెళ్లాల్సివచ్చినప్పుడు ముంబై నుండి కలిసి ప్రయాణించేది. కానీ ఈసారి ప్రత్యేకంగా, ఆటగాళ్లంతా తమ నగరాల నుంచి విడివిడిగా బయలుదేరనున్నారు. ఇది ఆటగాళ్ల లాజిస్టిక్స్, ప్రయాణ సౌలభ్యం కోసం బీసీసీఐ(BCCI) తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది.
Asia Cup | కొత్త నిర్ణయాలు..
ఓ బీసీసీఐ అధికారి.. సెప్టెంబర్ 4 సాయంత్రానికల్లా జట్టు సభ్యులందరూ దుబాయ్ (Dubai) చేరుకుంటారు. సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో మొదటి నెట్ సెషన్ జరగనుందని తెలియజేశారు. ఆసియా కప్ (Asia Cup) టీ20 కోసం భారత్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్: శుభ్‌మన్ గిల్ కాగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ టీంలో చోటు దక్కించుకున్నారు.
స్టాండ్‌బై ప్లేయర్లుగా రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, ప్రసీద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్.
ఈ స్టాండ్‌బై ఆటగాళ్లు ప్రధాన జట్టుతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. అయితే భారత్ షెడ్యూల్ చూస్తే.. సెప్టెంబర్ 10 – యూఏఈతో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 14 – పాకిస్తాన్‌తో మ్యాచ్ (దుబాయ్) , సెప్టెంబర్ 19 – ఓమన్‌తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈసారి భారత్ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా చోటు దక్కించుకోవడం విశేషం. వారితో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నందున ఆసియా కప్‌లో భారత్ ప్రదర్శనపై అంచనాలు పెరిగాయి. ఈ టోర్నీలో భారత్.. పాక్‌తో IND-PAK మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్.. పాక్‌తో ఆడుతున్న తొలి టోర్నీ కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.