అక్షరటుడే, వెబ్‌డెస్క్: Preity Zinta | పంజాబ్ జట్టు PSPK ఫైనల్‌కు చేరుకోవడంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేవు. పదేళ్ల తర్వాత ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు హుషారుగా, జోష్‌తో ఉత్సాహం కనిపించిన అందాల భామ మ్యాచ్ అనంతరం చేసిన ఓ సైగ అందర్నీ బుట్టలో పడేసేలా చేసింది. ప్రీతి జింటా కనుసైగ చేసిన విధం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో ఫైనల్ తేదీని ఖరారు చేసిన అనంతరం, పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ సమయంలో ప్రీతి మైదానంలోకి వచ్చింది. అక్కడే ఉన్న శ్రేయాస్(Shreyas)కు కన్ను గీటింది.
Preity Zinta | ఎక్స్‌ప్రెషన్..
ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఓడిపోవడంతో ప్రీతి ఒకింత బాధతో కనిపించింది. కానీ ఇప్పుడు తన జట్టు గొప్ప ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ను కౌగిలించుకుని హర్షాతిరేకానికి లోనయ్యింది. బాలీవుడ్ నటి అయిన ప్రీతి జింటా Preety Zinta మైదానంలోనే తన అభిమానం ప్రదర్శిస్తూ శ్రేయస్‌ను ప్రత్యేకంగా అభినందించింది. క్వాలిఫయర్–1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అనూహ్యంగా ఓటమి చెందడంతో ఆ జట్టును అభిమానించే వారంతా డీలా పడిపోయారు. తమ జట్టు అభిమానులను ఏ మాత్రం నిరాశ చెందనివ్వకుండా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. పోరాటంలో ఓడిపోయాం. కానీ ఈ యుద్ధంలో మాత్రం కాదు అంటూ మనో ధైర్యం నింపారు.
ఫైనల్ మ్యాచ్(Final Match)లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి పదేళ్ల తర్వాత తమ జట్టుని ఫైనల్‌కి తీసుకెళ్లాడు. 204 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్‌కు సిద్దమైంది. అయితే పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ వికెట్లు టపటప పడిపోయాయి. దాంతో బ్యాటింగ్ భారమంత శ్రేయాస్ అయ్యర్ (Shreyas iyer) పైనే పడింది. శ్రేయాస్‌కు జతగా కలిసిన నేహల్ వధేరా స్కోరు బోర్డుపై పరుగుల వేట మొదలుపెట్టారు. స్కోరును చకచకా పరుగులు పెట్టించారు. దాంతో పంజాబ్ జట్టుకు విజయం సులభమైంది. శ్రేయాస్ 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేహల్ కూడా అదే జోష్‌తో 29 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. శ్రేయాస్, వధేరా కలిసి ఆడుతున్నంత సేపు ప్రీతి జింటా తెగ ఎంజాయ్ చేసింది.