Preity-Zinta
Preity Zinta | అలా చేస్తే నాలో కాళిని చూస్తారు.. ప్రీతి జింతా వార్నింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Preity Zinta |బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా preity zinta గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ తరం ప్రేక్షకులకు ప్రీతి జింటా క్రేజ్ తెలియక పోవచ్చు , కానీ 1990ల్లో ప్రీతి జింటా అంటే తెలియని అభిమాని ఉండేవారు కాదు. 1998లో మణిరత్నం దర్శకత్వం వహించిన “దిల్ సే..” చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత “సోల్జర్”(Soldier) చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. “క్యా కెహనా” (2000), “దిల్ చాహ్తా హై” (2001), “కల్ హో నా హో” (2003) (ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు ప్ర‌తి జింతా. “వీర్-జారా” (2004), “సలామ్ నమస్తే” (2005) వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ప్రీతి జింతా ఖాతాలో ఉన్నాయి.

Preity Zinta | ప్రీతి క్యూట్ ఆన్స‌ర్..

ఇప్పుడు సినిమాల‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రీతి జింతా పంజాబ్ కింగ్స్(Punjab Kings) సహ యజమానిగా ఉన్నారు. ఇటీవ‌ల ఐపీఎల్‌(IPL)లో తెగ సంద‌డి చేసిన ప్రీతి జింతా ఇప్పుడు విరామం దొర‌క‌డంతో తన కవల పిల్లలు, జై మరియు జియాతో సమయం గడుపుతోంది. సోషల్ మీడియా Social media ద్వారా తన అభిమానులతో ముచ్చ‌టిస్తుంది. ఇటీవల ఒక సెషన్ నిర్వహించి కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇచ్చింది. ప్రజలు తన పిల్లల ఫోటోలు తీయడానికి లేదా షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు త‌న‌కి చాలా కోపం వ‌స్తుంద‌ని పేర్కొంది. ఒక అభిమాని ప్రీతిని “సాధారణ ప్రజలకు మీ గురించి తెలియని ఒక విషయం ఏమిటి?” అని అడిగాడు. దానికి ప్రీతి “నాకు ఆలయాల్లో, ఫ్లైట్ తర్వాత ఉదయాన్నే, బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫోటోలు తీయడం అస్సలు ఇష్టం ఉండదు!

ఆ స‌మ‌యాల‌లో తప్ప, మిగ‌తా స‌మ‌యంలో ఫోటో అడగడమే ఉత్తమ మార్గం అని చెప్పింది. నా పిల్లల ఫోటోలు తీస్తే నాలోని ‘కాళి'(‘Kali’) బయటకు వస్తుంది. అసలు నేను చాలా సరదా మనిషిని. నా అనుమతి లేకుండా వీడియోలు తీయడం మొదలు పెట్టకండి – ఇది చాలా ఇబ్బందికరం – నన్ను నేరుగా అడగండి, దయచేసి నా పిల్లలను వదిలేయండి అని చెప్పుకొచ్చింది. ఇక చాట్ ముగింపులో భాగంగా ప్రీతి “మరో సరదా చాట్ కి అందరికీ ధన్యవాదాలు! ఇంటర్వ్యూ కంటే ఈ చాట్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రశ్నలు చాలా బాగుంటాయి లేదా చాలా వింతగా ఉంటాయి. మీడియా Media వారికి కూడా విన్న‌పం.. నా మొత్తం సమాధానం రాయండి, దాన్ని కత్తిరించి వాడకండి అని కోరుకుంటున్నాను.