అక్షరటుడే, వెబ్‌డెస్క్: Preity Zinta | అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింటా (Preity Zinta) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందంతో ఈ ముద్దుగుమ్మ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో (Bollywood industry) చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు (Telugu audience) దగ్గరయ్యింది. అలాగే తెలుగులో మహేష్ బాబు (Mahesh Babu) జోడిగా రాజకుమారుడు చిత్రంలో నటించింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు సినిమాలకి దూరమైంది. అయితేనేం కోట్లు సంపాదిస్తుంది.
Preity Zinta | ఎన్ని ఆస్తులు..
ముఖ్యంగా ఐపీఎల్ (IPL) ద్వారా ప్రీతి జింతా ఖాతాలో కోట్లు వచ్చి పడుతున్నాయని అంటున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు (Punjab Kings team) ప్రీతి జింటా సహయజమాని. నివేదికల ప్రకారం ఈ హీరోయిన్ ఆస్తులు రూ.183 కోట్లు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా.. వ్యాపారం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంపాదిస్తుంది. 2008లో ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమాని (co-owner of the IPL team Punjab Kings) అయ్యారు. ఆ సమయంలో ఆమె రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు అది దాదాపు రూ.350 కోట్లకు చేరుకుంది.
2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభమైనప్పుడు దానిని $76 మిలియన్లకు కొనుగోలు చేశారు. 2022 నాటికి, దాని విలువ $925 మిలియన్లకు పెరిగింది. ఐపీఎల్‌లో టిక్కెట్ల (IPL ticket) అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఐపీఎల్ జట్టు యజమానులు కూడా వాటా పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం, టికెట్ల అమ్మకాలలో 80 శాతం జట్టు యజమానులకే వెళ్తాయి. జట్టు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. ప్రీతి జింటా ప్రస్తుతం తన భర్త జీన్ గూడెనఫ్, ఇద్దరు పిల్లలతో బెవర్లీ హిల్స్‌లో నివసిస్తుంది. ఇప్పుడు ప్రీతి జింటా (Preity Zinta) టీం ఫైనల్ ఆడనున్న నేపథ్యంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఫ్రాంచైజీ కూడా భారీ లాభాలను ఆర్జిస్తుంది.ఇక ఈ అమ్మడు సినిమాల ద్వారా కూడా బాగానే సంపాదించింది అని అంటున్నారు.