అక్షరటుడే, కామారెడ్డి: PHC Rajampet | గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని రాజంపేట పీహెచ్సీ వైద్యురాలు విజయ మహాలక్ష్మి పేర్కొన్నారు. రాజంపేట మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Rajampet Primary Health Center) గురువారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని నాలుగు ఉపకేంద్రాల నుండి గర్భిణులను ఆశాకార్యకర్తలు (ASHA workers) తీసుకువచ్చి వారికి రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, అధిక రక్తపోటు పరీక్షలు నిర్వహించారు.
PHC Rajampet | ‘అమ్మఒడి’ కార్యక్రమం..
అనంతరం వైద్యురాలు మాట్లాడుతూ.. గర్భిణులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని (Amma Odi program) చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు తగు జాగ్రత్తలను వివరిస్తున్నామన్నారు. బిడ్డ ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే గ్రామాల్లో ఉన్న ఆశాకార్యకర్తల ద్వారా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ సంగీత, సూపర్వైజర్ మహమ్మద్ మంజూర్, స్టాఫ్ నర్స్ ఇందిర, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.