pregnant inter girl | తొమ్మిదో తరగతి అబ్బాయి, ఇంటర్ మొదటి సంవత్సరం అమ్మాయి ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి ఓ పాపకు జన్మనిచ్చింది.
అంతా అయిపోయాక ఆ బాలుడు తనకేమీ తెలియదంటూ తప్పించుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
pregnant inter girl |
తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. సదరు బాలిక – బాలుడు కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసి పెద్దలు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. తనకేమీ తెలియదంటూ బాలుడు చేతులెత్తేశాడు.
దీంతో బాధిత బాలిక కుటుంబీకులు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బాలిక నవంబరు 14న ఓ పాపకు జన్మనిచ్చింది.
కానీ, తల్లీబిడ్డలను చూసేందుకు బాలుడు కానీ, అతడి ఫ్యామిలీ కానీ ఎవరూ రాలేదు. దీంతో శనివారం ఎస్పీకి బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. డీఎన్ఏ పరీక్ష చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.