అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ పేర్కొన్నారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో (Health Center) ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి షారోన్ షైని క్రిస్టినాతో మాట్లాడారు. హెపటైటిస్ బి కిట్లు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి ఇంటింటికీ తిరిగి మురికినీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. జ్వరానికి సంబంధించి రక్త పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ల్యాబ్ టెక్నీషియన్ అనితా రాథోడ్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, ఆనంద్, నర్సింగ్ ఆఫీసర్ ప్రకాశ్, గంగామణి పాల్గొన్నారు.